Aamir Khan Daughter: ఘనంగా అమీర్ ఖాన్ కూతురి పెళ్లి, డిఫరెంట్ కాస్ట్యూమ్ లో వరుడు
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే ను ఐరా వివాహం చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఐరా, నుపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
Aamir Khan Daughter: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే ను ఐరా వివాహం చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఐరా, నుపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ముంబైలోని ఓ హోటల్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. వివాహం అనంతరం అదే హోటల్లో రిసెప్షన్ జరిగింది. తన ప్రత్యేక రోజు న వరుడు నుపుర్ వస్త్రధారణ ఊహించని విధంగా ఉంది, అతను ధరించిన డ్రస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అతను కేవలం నలుపు రంగు చొక్కా మరియు తెల్లని షార్ట్ మాత్రమే ధరించాడు. పెళ్లిలో వరుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఏంటి అని అందరూ చర్చించుకోవడం విశేషం.
ఇరా ఖాన్ , నుపుర్ శిఖరే తమ సన్నిహితులు కుటుంబ సభ్యుల ముందు తమ వివాహ పత్రాలపై సంతకం చేశారు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలపై ఇరా నుపుర్ సంతకం చేస్తున్నారు. ఇరా తన ప్రత్యేక సందర్భం కోసం తెల్లటి దుస్తులను ఎంచుకుంది, అయితే నుపుర్ నలుపు రంగు చొక్కా , తెల్లని షార్ట్లను ధరించడం ద్వారా సాంప్రదాయ దుస్తులకు దూరంగా ఉన్నారు అమీర్ ఖాన్ రీనా దత్తా జంట వెనుక నిలబడి వారిని పైకి లేపారు. కిరణ్ రావు బంగారు పట్టు చీర ఆకుపచ్చ జాకెట్టు ధరించింది. ఆమె తన మొబైల్లో ప్రత్యేక క్షణాన్ని క్యాప్చర్ చేస్తూ కనిపించింది.
అమీర్ ఖాన్ తలపై సాఫా టై ధరించి కుర్తా , ధోతీలో పోజులిచ్చాడు. అయితే, ఈ వివాహం చాలా బిన్నంగా జరిగింది. సాధారణంగా వరుడు గుర్రం లేదా, కారుపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకుంటూ ఉంటారు. అయితే నుపుర్ మాత్రం దాదాపు 8 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ వివాహ వేడుక వద్దకు చేరుకున్నాడు. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను మనువాడాడు. ఇక ఈనెల 8వ తేదీన ఈ జంట మరోసారి వివాహ వేడుక జరుపుకోనుంది. ఆ తర్వాత జనవరి 13వ తేదీన ముంబైలో గ్రాండ్గా వివాహ విందు ఏర్పాటు చేయనున్నారు.
ఇక ఈ వివాహ వేడుకకు అమీర్ ఖాన్, తన మాజీ భార్యలు రీనా దత్త, కిరణ్ రావు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్-నీతా అంబానీ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఐరా-నుపుర్ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.