గుజరాత్ అల్లర్లు, గోధ్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా పార్లమెంటులో ప్రదర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి ఈ సినిమాను నటీనటులు విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా వీక్షించారు. ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ.. ఇదో ప్రత్యేక అనుభూతని తెలిపాడు. చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఇది తన కెరీర్లో అత్యున్నత దశ అని చెప్పుకొచ్చాడు.