జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘KCR'(కేశవ చంద్ర రమావత్) మూవీ గత నెల 22న రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ OTT సంస్థ ఆహాలో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమాకు గరుడ వేగ అంజి దర్శకత్వం వహించగా.. అనన్య కృష్ణన్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.