ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఆగిపోయిందని, హీరో లుక్ బాలేక సీన్లు తొలగించారని వస్తున్న వార్తలపై మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఆ పుకార్లలో నిజం లేదని, కేవలం చిన్న విరామం మాత్రమేనని స్పష్టం చేసింది. సినిమా పక్కా ప్లానింగ్‌తోనే జరుగుతోందని, అధికారిక సమాచారం వచ్చే వరకు ఇలాంటి వదంతులను నమ్మవద్దని క్లారిటీ ఇచ్చింది.