PDPL: గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జీ. నరేందర్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో యువత పాత్ర కీలకమన్నారు. జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.