Manchu Manoj : మరో ఆసక్తికర ట్వీట్ చేసిన మంచు మనోజ్
సోషల్ మీడియాలో (social media) మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు తీవ్ర దుమారం రేపిన విషయ తెలిసిందే. అన్న విష్ణు తీరుపై మనోజ్ (Manoj) నిన్న ఓ వీడియోను పోస్టు చేయడం కలకలం రేపింది. తండ్రి మోహన్ బాబు (Mohan Babu) ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనోజ్ పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేశారు. ఇదేమంత పెద్ద గొడవ కాదని, మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయమని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియాలో (social media) మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు తీవ్ర దుమారం రేపిన విషయ తెలిసిందే. అన్న విష్ణు తీరుపై మనోజ్ (Manoj) నిన్న ఓ వీడియోను పోస్టు చేయడం కలకలం రేపింది. తండ్రి మోహన్ బాబు (Mohan Babu) ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనోజ్ పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేశారు. ఇదేమంత పెద్ద గొడవ కాదని, మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయమని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ట్విట్టర్ (Twitter) లో ఆసక్తికర పోస్టు చేశారు.‘‘బతకండి (Batakaṇḍi) ..బతకనివ్వండి. మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.
కొటేషన్స్ ఉన్న మరో రెండు ఫొటోలను కూడా షేర్ చేశారు. ‘అన్ని తప్పులను చూస్తూ పట్టించుకోకుండా జీవించడం కంటే.. సరైన దాని కోసం పోరాడుతూ చనిపోతాను’’ అని అమెరికన్ రచయిత సుజీ కాసెమ్ (author is Suzy Kasem) చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కళ్ల ముందు జరుగుతున్న తప్పులను చూసీచూడనట్లు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధమే అనే కోట్స్ ను పోస్ట్ చేశారు.‘‘క్రియేటివిటీకి నెగిటివిటీనే పెద్ద శత్రువు’’ అంటూ అమెరికన్ ఫిల్మ్ మేకర్ డేవిడ్ లించ్ (David Lynch) చేసిన వ్యాఖ్యలను కోట్ చేశారు. అన్నదమ్ముల మధ్య గొడవ తర్వాతి రోజే మనోజ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్(Viral) గా మారింది