కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సినీ గ్లామర్ ని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే.. ఇటీవల ఎన్టీఆర్ ని అమిత్ షా, నితిన్ ని మరో కేంద్ర మంత్రి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. కాగా… తాజాగా… ప్రభాస్‌ని కూడా కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీనియర్ హీరో కృష్ణం రాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ క్రమంలో ప్రభాస్ ని ఓదార్చడానికి అమిత్ షా వస్తున్నట్లు సమాచారం.
గతంలోలా హీరోలను పిలిపించుకొని కాకుండా స్వయంగా ప్రభాస్ ఇంటికే వెళ్లి షా తనని కలిసి వారి కుటుంబంతో మాట్లాడనున్నట్టుగా ఇపుడు అంటున్నారు. ఇక ఇంతకీ అమిత్ షా ఎప్పుడు ప్రభాస్ ని కలవనున్నారు అంటే ఈ సెప్టెంబర్ 16నే కలవనున్నారట. అంటే రేపే ఇక్కడికి వచ్చి పరామర్శించనున్నారని సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.
దీనితో ఈ మీటింగ్ అంశం కూడా సినీ వర్గాల్లో ఆసక్తిగా మారగా మరో కారణం కూడా దీనిపై ఉందని కొందరు అంటున్నారు. ఎలాగో టాలీవుడ్ హీరోలకి దగ్గరవ్వాలని ఈ పార్టీ చూస్తున్నట్టు అర్ధం అవుతుంది. మరి ఈ సమయాన్ని కూడా వారు తమకి అనుకూలంగా మార్చుకునే స్థాయి రాజకీయాలు చేస్తారా అంటూ మరికొందరు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.