గత కొన్ని రోజులుగా సినీ హీరో అల్లు అర్జున్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. బన్నీ అరెస్ట్ గురించి తాజాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ప్రశ్న ఎదురైంది. ఈ విషయంలో తాను ఏమీ మాట్లాడాలనుకోవడం లేదని అన్నాడు. ‘నేను ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు కోర్టులో ఉన్నందున దీనిపై మాట్లాడటం సరికాదు. కోర్టుపై నాకు నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలి’ అని జవాబు ఇచ్చాడు.