TG: సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం రేవంత్‌తో చర్చలు జరిపామని FDC ఛైర్మన్ దిల్ రాజు తెలిపారు. ‘తెలుగు సినిమాపై సీఎం విజన్ ఏంటో చెప్పారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నారు. ఇంటర్నేషనల్ సినిమా హబ్‌గా HYDను మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలు చిన్న విషయాలు. ఇండస్ట్రీ అభివృద్ధి మా ముందున్న అతిపెద్ద లక్ష్యం’ అని అన్నారు.