మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ మూవీని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గుర్తుచేసుకున్నారు. ‘కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో మన్మోహన్ పాత్రను చేయకూడదనుకున్నా. కానీ, అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రలో నటించే అవకాశం అందరికీ రాదని ఒప్పుకున్నాను. మన్మోహన్ గొప్ప నాయకుడు. ఆ చిత్రం వివాదాస్పదం కావొచ్చు. ఆయన మాత్రం వివాదరహితుడే’ అని అన్నారు.