ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డుల వేడుక నిన్న రాత్రి ఘనంగా జరిగింది. నేరుగా OTTలో విడుదలైన చిత్రాలు, సిరీస్‌లకు ఈ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటిగా కరీనా కపూర్, ఉత్తమ నటుడిగా దిల్జిత్ దొసాంజ్ అవార్డు అందుకున్నారు. సాయిదుర్గా తేజ్, స్వాతి నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’కు పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కింది.