సత్యసాయి: జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెరిగింది. హిందూపురంలో వార్డుల సంఖ్య 38 నుంచి 52కి, ధర్మవరంలో 40 నుంచి 48కి పెరిగాయి. కదిరిలో 36 నుంచి 44కి, పెనుకొండలో 20 నుంచి 23కి వార్డులను పెంచారు. మడకశిరలో 20 నుంచి 23కి, పుట్టపర్తిలో 27 నుంచి 28కి వార్డుల సంఖ్యను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.