గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ‘పెద్ది’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడుతున్నట్లు చరణ్ చెప్పాడు. దీనికోసం దాదాపు ఏడాదిన్నరగా కఠోర శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఇలాంటి పాత్రల్లో ఫిట్‌గా కనిపించడం ముఖ్యమని ఈ పాత్ర కోసం సుల్తాన్, దంగల్ వంటి సినిమాలకు పనిచేసిన కోచ్ దగ్గర కుస్తీ నేర్చుకుంటున్నట్లు వెల్లడించాడు.