సినిమాలకు బ్రేక్ తీసుకోవడం వెనుక గల కారణాలను నటుడు విక్రాంత్ మాస్సే తాజాగా పంచుకున్నాడు. తన కుమారుడు వర్ధాన్ పుట్టిన తర్వాత తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాననే అపరాధభావం, పని ఒత్తిడి వల్ల కలిగిన మానసిక అలసట వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. పిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్ర కీలకమని, కుటుంబంతో గడపడానికే సినిమాలకు విరామం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.