తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం నటుడు అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా తన పేరు, గొంతు, ఫొటోలను వాణిజ్యపరంగా వాడకూడదని కోరాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, 3 రోజుల్లో కంప్లయన్స్ రిపోర్ట్ ఇవ్వాలని ‘ఫేక్ కాల్ పుష్ప’ సంస్థను ఆదేశించింది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల రక్షణలో ఈ తీర్పు అత్యంత కీలకంగా మారింది.