సన్నీ లియోనీ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆర్.యువన్ తెరకెక్కించిన సినిమా ‘మందిర’. ఈ చిత్రం డిసెంబర్ 5 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ‘సన్నీతో ఆటలు అనుకున్నంత ఫన్నీ కాదు. జాగ్రత్తంగా ఉండండి’ అంటూ ‘ఆహా’ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ పంచుకుంది. ఈ సినిమా నవంబరు 22న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.