విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నాగబంధం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కాగా.. తాజాగా సెకండ్ సింగిల్‌పై అప్డేట్ వచ్చింది. ‘సుర సుర’ అంటూ సాగే ఈ పాట ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది. ఇక 2026 జూలై 3న విడుదల కానున్న ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్యా మేనన్, జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.