విజయ్ ‘జన నాయగన్’ మూవీ సీన్స్ లీక్‌కు కారణం ఎడిటర్ ప్రదీప్ ఇ. రాఘవ్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎడిటర్స్ యూనియన్ ఖండించింది. ఈ ఘటనతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ‘గ్రాఫిక్స్, సౌండ్ మిక్సింగ్‌ను మరింత మెరుగు పరిచేందుకు దర్శకుడు, నిర్మాతల అనుమతితోనే సినిమా కాపీని జనవరిలోనే ఓ స్టూడియోకి ప్రదీప్ పంపారని పేర్కొంది.