TG: తెలుగు సినీ నిర్మాతలకు ఇవాళ శుభదినమని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి.. ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ సందర్భంగా అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని ప్రభుత్వానికి తెలిపినట్లు వివరించారు.