బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రాబోతుంది. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌పై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగుతున్నట్లు వెల్లడించాడు. ఈ టీంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందంటూ ఫొటో షేర్ చేశాడు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.