తమిళ హీరో సూర్య నటించిన ‘కంగువా’ థియేట్రికల్ రన్ పూర్తయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుని ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా నిలిచింది. రూ.130 కోట్ల మేర నష్టం వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా పేరిట ఇప్పటివరకు ఉన్న చెత్త రికార్డును కంగువా బ్రేక్ చేసింది. రాధేశ్యామ్ మూవీకి రూ.120 కోట్లు నష్టం వాటిళ్లింది.