కన్నడ నటి శోభిత మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు. శోభిత బంధువులు బెంగళూరు నుంచి ఉస్మానియా మార్చురీకి భారీగా తరలొచ్చారు. అనంతరం మృతదేహాన్ని బంధువులు బెంగళూరుకు తరలించారు. కాగా, నిన్న హైదరాబాద్ గచ్చిబౌలిలో శోభిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.