సిల్వర్ స్క్రీన్‌పై 49 ఏళ్ల క్రితం మ్యాజిక్ క్రియేట్ చేసి భారతీయ సినీ చరిత్రలో ఐకానిక్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలిచిన చిత్రం ‘షోలే’. రమేశ్ షిప్పి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎంతోమంది సెలబ్రిటీలను ప్రభావితం చేసింది. వీరిలో హరీశ్ శంకర్ ఒకడు. తన సినిమాలపై షోలే ప్రభావం ఉంటుందని చెప్తుండే ఈ దర్శకుడికి తన అభిమాన దర్శకుడు షిప్పిని కలిసే అరుదైన అవకాశం లభించింది. ఈ విషయాన్ని హరీశ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.