‘రామాయణ’లో రావణుడిని కేవలం విలన్గా కాకుండా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా చూపించనున్నట్లు దర్శకుడు నితేష్ తివారి తెలిపాడు. గొప్ప వీరుడు, సంగీత విద్వాంసుడు, శివ భక్తుడైన రావణుడిలోని సానుకూల కోణాలను ఆవిష్కరిస్తూనే.. పగ, అహంకారం వల్ల అపార మేధావి ఎలా పతనమయ్యాడో వివరిస్తామన్నాడు. ఈ పాత్ర ద్వారా సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించడమే తమ ఉద్దేశమని పేర్కొన్నాడు.