ఈ ఏడాదిలో చాలామంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారిలో పలువురు తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. విజయ్ బిన్నీ(నా సామిరంగ), యదు వంశీ(కమిటీ కుర్రోళ్లు), అంజి కె.మణిపుత్ర(ఆయ్), నందకిశోర్ ఈమని(35 చిన్న కథ కాదు), సుజిత్, సందీప్(క), విద్యాధర్ కాగిత(గామి), దుష్యంత్ కటికనేని(అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్) తదితరులు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.