పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన మ్యాజిక్ చేయలేకపోయింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం, మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.80.75 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు టాక్. డివైడ్ టాక్, నెగిటివ్ కామెంట్స్ సినిమాపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో పోలిస్తే ఈ వసూళ్లు తక్కువని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.