సీఎం పదవిని తిరస్కరించినట్లు బాలీవుడ్ నటుడు సోనూసూద్ తెలిపారు. కోవిడ్ సమయంలో వలస కూలీలకు సాయం చేసిన తనకు సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్య సభ్యుడిగా అవకాశాలు వచ్చాయని అన్నారు. సంపాదించుకోవడానికి, అధికారం కోసం చాలామంది రాజకీయాల్లోకి వెళ్తారని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికే అయితే తాను అదే పని చేస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.