నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తోన్న అన్‌స్టాపబుల్ షోలో హీరో విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు. తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి బాలయ్యతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన సతీమణి నీరజ గురించి ఆయన మాట్లాడారు. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అని.. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా భార్యతో సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతానని వెంకటేశ్ తెలిపారు.