TG: CM రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పోస్ట్ పెట్టింది. ‘ప్రభుత్వానికి సినీ పరిశ్రమ మద్దుతు ఉంటుంది. దూరదృష్టి గల సీఎం రేవంత్ నాయకత్వాన్ని అభినందిస్తున్నాం. మూవీ షూటింగ్స్ విషయంలో HYDని గ్లోబల్ హబ్‌గా మార్చడానికి సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. డ్రగ్స్ రహిత సమాజానికి తమ వంతు కృషి చేస్తాం’ అని పేర్కొంది.