టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఈనెల 5న కావ్య రెడ్డి అనే అమ్మాయితో శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక జరగనుంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరుకానున్నారు. ఇక వీరి వివాహం ఏప్రిల్ 29న తిరుమల శ్రీవారి సన్నిధిలో జరగనుంది. త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.