యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మారుతి దర్శకత్వంలో నటిస్తున్న ‘రాజా సాబ్’ వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక పోస్టర్ విడుదల కానుంది. కాగా రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్లో రాజా సాబ్ మూవీ తెరకెక్కుతోంది.