చిన్న సినిమాగా రిలీజై భారీ విజయం అందుకున్న మలయాళ మూవీ ‘వజా 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. భారీ బడ్జెట్, స్టార్లు లేకపోయినా కథతో మెప్పించవచ్చని ఈ సినిమా నిరూపించింది. కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. దర్శకుడు నవీన్ ఎస్ఏ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ డ్రామా.. చదువు అబ్బని నలుగురు స్నేహితుల కథ చుట్టూ తిరుగుతుంది.