ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనౌన్స్మెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అంటే, అది రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్ సాలిడ్ బజ్ ఒకటి వైరల్‌గా మారింది.
గత కొన్నాళ్లుగా ఊరిస్తు వస్తున్న మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్.. నెక్స్ట్ ఇయర్ నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. బాహుబలితో పాన్ ఇండియా, ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్‌ను ఆస్కార్‌కు తీసుకెళ్లిన జక్కన్న.. ఈసారి ఏకంగా హాలీవుడ్‌నే టార్గెట్ చేస్తున్నాడు.
ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. వాస్తవానికైతే 2023లోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ మహేష్ బాబు ‘గుంటూరు కారం’తో బిజీగా ఉండడం.. రాజమౌళి స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నాడు కాబట్టి డిలే అయింది. కానీ ఇప్పుడు వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ మూవీని భారీ సెట్లో షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా 100 కోట్ల ఖర్చుతో ఓ భారీ సెట్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ భాగం షూటింగ్ ఈ సెట్లోనే జరగనున్నట్లు సమాచారం. ఈ సెట్‌తో పాటు ఆఫ్రికా, యూరప్‌లోనూ షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే రాజమౌళి లొకేషన్లను కూడా ఫైనల్ చేశాడట.
వచ్చే ఏడాది సమ్మర్లో షూటింగ్ మొదలు పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు. మహేష్ బాబు కూడా గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చేసేశాడు కాబట్టి.. కొన్ని రోజులు ట్రైనింగ్ అనంతరం రాజమౌళి ప్రాజెక్ట్‌లో జాయిన్ కానున్నాడు. మరి జక్కన్న నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడుస్తుందో చూడాలి.