Mahesh Babu : షాక్ ఇచ్చిన మహేష్ బాబు.. ఆ కుర్చీని మడతపెట్టి?
అసలు ఇది.. మహేష్ బాబు రేంజ్ సాంగేనా? బాబు నుంచి ఇలాంటి సాంగ్ ఒకటి వస్తుందా? అని అభిమానులు అస్సలు ఊహించలేదు. ఆ కుర్చీని మడబెట్టి.. అంటూ షాక్ ఇచ్చాడు మహేష్. తాజాగా గుంటూరు కారం నుంచి థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేయగా.. వైరల్‌గా మారింది.
తాజాగా గుంటూరు కారం నుంచి ఆ కుర్చీని మడతబెట్టి.. అంటూ సాగే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే.. సీట్లో కూర్చునేలా లేరు ఘట్టమనేని ఫ్యాన్స్. మహేష్, శ్రీలీల వేసిన స్టెప్పులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. తమన్ ఇచ్చిన మాస్ బీట్ మామూలుగా ఉండదు.. అనేలా ఉంది ఈ ప్రోమో. కానీ ఇది మహేష్ బాబు రేంజ్ సాంగ్ కాదనే చెప్పాలి. అసలు మహేష్ రేంజ్ ఏంది.. ఇలాంటి డైలాగ్‌తో సాంగ్ ఏంటీ? అనేదే అంతుపట్టకుండా పోయింది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే డైలాగ్స్‌తో డీజె సాంగ్స్.. లేదంటే కొన్ని చిన్న చితకా సినిమాల్లో పాటలు వస్తుంటాయి. కానీ ఆ కుర్చీని మడతబెట్టి డైలాగ్‌తో.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నుంచి ఇలాంటి సాంగ్ బయటికి రానుండడంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త షాక్ అవుతున్నారు. రీసెంట్గా ఓ మై బేబి సాంగ్‌కే తమన్ దారుణమైన ట్రోలింగ్ ఫేజ్ చేయాల్సి వచ్చింది. అలాంటిది.. ట్రోలింగ్ డైలాగ్‌తో సాంగ్ అంటే.. సాంగ్ తేడా కొడితే మహేష్ ఫ్యాన్స్‌ను తట్టుకోవడం కష్టమే. డిసెంబర్ 30న ఈ ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఇప్పటి వరకు గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కంటే.. ఈ సాంగ్ బెటర్‌గా ఉంటుందేమో చూడాలి.