»Poonam Kaur Once Again Poonam Satires On Trivikram
Poonam Kaur: మరోసారి త్రివిక్రమ్‌పై పూనమ్ సెటైర్లు..!
టాలీవుడ్ నటి పూనమ్ నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉంటారు. తనకు సంబంధం లేని విషయాల్లోనూ తలదూర్చి ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా త్రివిక్రమ్‌పై కూడా సెటైర్లు వేసింది.
Poonam Kaur: టాలీవుడ్ నటి పూనమ్ నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉంటారు. తనకు సంబంధం లేని విషయాల్లోనూ తలదూర్చి ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమెకు త్రివిక్రమ్‌తో వ్యక్తిగత సమస్యలున్నాయన్నది జగమెరిగిన రహస్యం. చాలా సార్లు త్రివిక్రమ్ బూటకపు వాగ్దానాల వల్ల తాను చాలా ప్రభావితమయ్యానని ఆమె తెలిపింది.
ఈ సమస్యలు 2008-2009 మధ్యకాలంలో జరిగాయి. అప్పటి నుండి పూనమ్ కౌర్‌కి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఇద్దరితో సమస్యలు ఉన్నాయి. ఆమె టార్గెట్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ లేదా త్రివిక్రమ్ ఇప్పటివరకు స్పందించలేదు. నిన్న భీమవరంలో జరిగిన రాజకీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..‘ పవర్ ఫుల్ కౌంటర్లు ఇవ్వడానికి చాలా సిగ్గుపడుతున్నాను. వాళ్లు ‘సిద్ధం’ అంటే నేను ‘యుద్ధం’ అంటా అన్నారు.
అలాంటి పంచ్ డైలాగులు సినిమాల్లో కూడా సరిగ్గా చెయ్యను. త్రివిక్రమ్ అత్తారింటికి దారేదిలో “సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా” డైలాగ్ చెప్పమంటే, నా బాధ భరించలేక కామెడీగా చెప్పామన్నారని పవన్ అన్నారు. ఒక మీడియా వెబ్సైట్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. త్రివిక్రమ్‌ని యూజ్లెస్ ఫెలో అంటూ పూనమ్ కౌర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది. మొదట్లో ఫేక్ అకౌంట్ అని భావించినా, అది ఆమె ఒరిజినల్ అకౌంట్ తెలిసింది.