అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి చాలామంది కశ్మీర్‌కి వెళ్తుంటారు. ఇక్కడ ప్రదేశాలు ఎంతో అందంగా ఉంటాయి. అయితే ఈ కశ్మీర్లో కొన్ని ప్రదేశాలను అస్సలు ఈ సీజన్లో మిస్ కావద్దు.
భూతల స్వర్గం కశ్మీర్ అందాలను జీవితంలో ఒక్కసారైన వీక్షించాలనే కోరిక ఉంటుంది. ఎత్తయిన పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ప్రకృతి అంతా పాల సముద్రంలా మెరుస్తుంది. ఇలాంటి ప్రకృతిని వీక్షించడానికి చాలామంది ఈ సీజన్లో కశ్మీర్ వెళ్తుంటారు. అయితే కశ్మీర్లో అత్యంత సుందరభరితమైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వీటిని జీవితంలో ఒక్కసారైన తప్పకుండా వీక్షించాల్సిందే. మరి ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం.
కశ్మీర్‌లోని అందమైన ప్రదేశాల్లో శ్రీనగర్ ఒకటి. ఇక్కడ మంచుతో కప్పబడి ఉండే అందమైన పర్వతాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు. శ్రీనగర్‌లో దాల్ సరస్సు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇది చూడటానికి చాలా సుందరంగా ఉంటుంది. ఈ శ్రీనగర్‌లో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. హిమపాతాన్ని ఆస్వాదించాలంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది.