రామ్ గోపాల్ వర్మపై శిరీష(బర్రెలక్క) మహిళా కమిషన్లో కేసు నమోదు చేశారు. తాజాగా వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వర్మ బర్రెలక్కపై చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి.
Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై శిరీష(బర్రెలక్క) మహిళా కమిషన్లో కేసు నమోదు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో శిరీష్ కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి శిరీష పోటీ చేశారు. అయితే తాజాగా వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వర్మ బర్రెలక్కపై చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఊరు పేరు లేని ఆవిడ బర్రెలక్కగా చాలా ఫేమస్ అయిపోయింది. బర్రె లెక్క కాస్త ఉంటుంది. బర్రెలు ఆమె మాట కూడా వింటున్నారు. అందుకే ఆమెను బర్రెలక్క అంటారని రాం గోపాల్ వర్మ వ్యాఖ్యానించారని శిరీష తరఫున లాయర్ వెల్లడించారు. రాంగోపాల్ వర్మ నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకుని బతుకు. మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకుని ప్రయత్నం చేస్తుంటే ఇలా చేయడం తప్పు అని శిరీష తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఇలాంటి మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే.. తెలంగాణ నుంచి తరిమికొడతామని వర్మని హెచ్చరించారు.