ఇటీవలే ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’తో వచ్చిన నటుడు తిరువీర్ మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన విలేజ్ కామెడీ సినిమా ‘పాపం ప్రతాప్’. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఏప్రిల్ 17కి వాయిదా వేశారు. ఇక S.P దుర్గా నరేష్ తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ కథానాయికగా.. ప్రసాద్ బెహర, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.