సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనపుడు చాలా మంది తనను హెచ్చరించారని నటి కరీనా కపూర్ చెప్పారు. ‘కెరీర్లో ఓ స్థాయిలో ఉన్నప్పుడు సైఫ్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో చాలా మంది నన్ను హెచ్చరించారు. పెళ్లి చేసుకుంటే కెరీర్ ముగిసినట్టే అన్నారు.. కానీ వారి మాటలు పట్టించుకోలేదు. వాస్తవానికి పెళ్లి తర్వాతే నేను ఎక్కువగా వర్క్ చేశా’ అని చెప్పుకొచ్చారు.