»What Should Be Done To Prevent Alzheimers Disease
Alzheimer’s వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
జీవనశైలి మార్పులతో అల్జీమర్స్ ప్రమాదం తగ్గుతుందా? అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. జీవనశైలి మార్పులతో అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మరి ఎలాంటి జీవన శైలి మార్పులు చేసుకుంటే.. అల్జీమర్స్ రాకుండా ఉంటుందో ఓసారి చూద్దాం..
ఆహారం:
పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోండి.
ఆకుకూరలు, పండ్లు, చేపలు, గింజలు, విత్తనాలు, పప్పుధాన్యాలు వంటివి మెదడు ఆరోగ్యానికి మంచివి.
శారీరక శ్రమ:
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
చురుకైన నడక, ఎరోబిక్స్, యోగా వంటివి మంచివి.