»Rahul Gandhis Second Freedom March Is Called Bharat Jodo Nyay Yatra
Rahul Gandhi: రాహుల్ గాంధీ రెండో యాత్ర.. పేరులో మార్పు
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండో విడుత యాత్రకు సిద్ధం అయ్యారు. జనవరి 14 నుంచి మార్చి 30 వరకు చేపట్టే ఈ యాత్ర పేరును, ఇతర వివరాలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వెల్లడించారు.
Rahul Gandhi's second freedom march is called Bharat jodo Nyay Yatra
Rahul Gandhi: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరో యాత్రకు సిద్ధం అయ్యారు. గతేడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర(Bharath Jodo Yathra) పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. ఫలితంగా కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరో సారీ రాహుల్ గాంధీ జాతీయ యాత్రను చెపట్టనున్నారు. ముందు దీనికి భారత్ న్యాయ్ యాత్ర అని పేరు పెట్టారు. తరువాత దానికి భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra)గా పేరు మార్చినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం గురువారం జరిగింది. ఈ భేటీలోనే రాహుల్ గాంధీ యాత్ర పేరును ఖారారు చేసినట్లు జైరాం రమేశ్ తెలిపారు. ‘భారత్ జోడో న్యాయ్’ యాత్ర జనవరి 14న ప్రారంభమవుతుందని, మార్చి 30న ముగుస్తుందని వెల్లడించారు. దీనికి ఇండియా కూటమిని ఆహ్మానించినట్లు తెలిపారు. మణిపూర్లో మొదలైన ఈ యాత్ర అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖాండ్, ఒడిశా, చత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజాస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో మొత్తం 6,713 కిలోమీటర్లు యాత్ర చేస్తారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ 66 రోజులు కొనసాగనుంది. 15 రాష్ట్రాల్లో 100 లోక్ సభ స్థానాల పరిధిలో ఈ యాత్ర జరగనుంది. ఈసారి రాహుల్ ఎక్కువగా బస్సు ద్వారా యాత్ర చేస్తారని తెలుస్తోంది.