»Uttar Pradesh Threats To The Cm Saying That They Will Blow You Up Along With The Ram Mandir
Uttar Pradesh: రామమందిరంతో పాటు నిన్ను పేల్చేస్తామంటూ.. సీఎంకి బెదిరింపులు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి కూడా బెదిరింపులు వచ్చాయి. అయోధ్యలో నిర్మించిన రామమందిరంతో పాటు యోగి ఆదిత్యనాథ్‌ను పేల్చివేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.
Uttar Pradesh: ప్రముఖులకు ఈమధ్య ఎక్కువగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి కూడా బెదిరింపులు వచ్చాయి. అయోధ్యలో నిర్మించిన రామమందిరంతో పాటు యోగి ఆదిత్యనాథ్‌ను పేల్చివేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేళ ఇలాంటి బెదిరింపులు రావడంతో కలకలం రేపుతున్నాయి. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇద్దరిని అరెస్ట్ చేశారు.
పేలుళ్లకు పాల్పడతమాని నిందితులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఎస్టీఎఫ్ చీఫ్ అమితాబ్ యశ్‌ను కూడా హత్య చేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై విచారణ చేసి ఓం ప్రకాశ్, తాహర్ సింగ్‌లుగా గుర్తించారు. గోండాకు చెందిన వీరిద్దరూ పారామెడికల్ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్నారని తెలిపారు. తాహర్ సింగ్ మెయిల్స్ క్రియేట్ చేయగా.. ప్రకాశ్ బెదిరింపులకు పాల్పడ్డాడు.