YS Sharmila: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. షర్మిల పార్టీలో చేరడంతో వైఎస్సార్టీపీ కాంగ్రెస్లో విలీనం అయ్యింది. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రుద్రరాజు, పలువురు నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరిన షర్మిలకు ఆంధ్ర పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు రాహుల్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
"Congress party is still the largest secular party of our country and it has always upheld the true culture of India…"#YSRTP chief & Andhra Pradesh CM's sister #YSSharmila joins Congress, in the presence of party president Mallikarjun Kharge and Rahul Gandhi.@realyssharmilapic.twitter.com/opbMyMjx6a
వైఎస్సార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడం చాలా సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్ తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు. మా నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నా. దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీ చేయలేదు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం మా నాన్న కల. అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన కృషి చేస్తానని కాంగ్రెస్లో చేరిన అనంతరం షర్మిల మాట్లాడారు.