»Qatar Jail Sentence For Indians 60 Days To Appeal
Qatar: భారతీయులకు జైలు శిక్ష.. అప్పీలుకు 60 రోజులు గడువు
ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై భారత్‌కు చెందిన 8 మంది నేవీ మాజీ ఉద్యోగులకు మొదటిగా మరణశిక్ష విధించింది. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖతార్ అధికారులతో చర్చలు జరపగా మరణశిక్షను రద్దు చేస్తూ.. జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ జైలు శిక్షపై అప్పీలు చేసుకోవచ్చని ఇటీవల తెలిపింది.
Qatar: ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై భారత్‌కు చెందిన 8 మంది నేవీ మాజీ ఉద్యోగులకు మొదటిగా మరణశిక్ష విధించింది. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖతార్ అధికారులతో చర్చలు జరపగా మరణశిక్షను రద్దు చేస్తూ.. జైలు శిక్ష విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నిరోజులు జైలు శిక్ష అనే విషయం మాత్రం చెప్పలేదు. ఈ జైలు శిక్షపై అప్పీలు చేసుకోవడానికి ఖతార్ కోర్టు 60 రోజుల వ్యవధిని ఇచ్చినట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. భారత న్యాయ సహాయ బృందాలకు 60 రోజుల గడువు ఇచ్చింది. ఈ లోగా జైలు శిక్షపై కూడా అప్పీలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ అప్పీలు ఖతర్ అత్యున్నత న్యాయస్థానం ఎదుట విచారణకు వస్తుందని తెలిపారు. మరణ శిక్ష రద్దు చేసినప్పటి నుంచి 60 రోజుల గడువు మొదలైందని తెలిపారు.
భారత్‌కు చెందిన ఈ ఎనిమిది మందిని ఖతార్ అధికారులు 2022 ఆగస్టులో నిర్భంధంలోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం.. ఆ 8 మందికి మరణశిక్ష విధిస్తున్నట్లు ఈ ఏడాది అక్టోబర్‌లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ దోహాలో అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీలను పరిగణనలోకి తీసుకుని వారి మరణశిక్షను రద్దుచేసి జైలు శిక్ష విధించింది. మరణశిక్ష పడిన వారిలో కెప్టెన్లు సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగ్‌పాల్, సెయిలర్ రాగేశ్ ఉన్నారు.