»Ernakulam Court Sentenced The Accused To Death In The Aluva Child Murder Case Kerala
Death Penalty: చిన్నారి అత్యచార కేసులో మరణశిక్ష..ఇదే అమలు చేయాలంటున్న నెటిజన్లు
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్మకు పాల్పడిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది. 110 రోజులు పాటు వాదనలు విన్న కోర్టు బాలల దినోత్సవం రోజున తీర్పును వెలవరించింది. కోర్టు తీర్పుపై నెటజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఉరిశిక్షే సరియైనది అని అభిప్రాయపడుతున్నారు.
Ernakulam court sentenced the accused to death in the Aluva child murder case, Kerala
Death Penalty: చిన్నారి హత్యాచార కేసులో కేరళ(Kerala)లోని ఎర్నాకులం(Ernakulam) కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చిన్నారిని అత్యాచారం(Rape), హత్య(Murder) చేసిన దోషికి మంగళవారం మరణశిక్ష విధించింది. బీహార్(Bihar)కు చెందిన వలస కార్మికుడు అశ్వక్ ఆలమ్ అలువలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపినందుకు ఎర్నాకుళం పోక్సో కోర్టు న్యాయమూర్తి కె సోమన్ ఈ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ చేసిన వాదనలను కోర్టు పూర్తిగా అంగీకరించింది. ఏమి తెలియని పసిపాపను రేప్ చేసి చంపిన నిందితుడు ఎట్టిపరిస్థితిల్లో క్షమాపణకు అర్హుడు కాదని తెలిపింది. సమాజానికి ఇతనొక చీడపురుగని కోర్టు అభిప్రాయపడింది.
ఈ సంవత్సరం జులై నెలలో బీహార్ వలస కార్మికుడు అశ్వక్ ఆలమ్ అదే భవనంలో నివసిస్తున్న ఐదేళ్ల బాలికను అపహరించి, అత్యాచారం చేశాడు. ఆ తరువాత భయంతో హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి స్థానిక మార్కెట్ వెనుకవైపు విసిరేశాడు. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆలమ్‌ను అరెస్ట్ చేశారు. ఫోక్సో చట్టం, భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద లైంగిక వేధింపులు, అత్యాచారం, హత్యతో సహా ఆలమ్‌పై 16 కేసు నమోదు చేశారు. నవంబర్ 4న ఫోక్సో కోర్టు ఆలమ్ ఈ 16 నేరాలలో శిక్షార్హుడిగా నిర్ధారించింది. 110 రోజుల పాటు వాదనలు విన్న కోర్టు, మంగళవారం బాలల దినోత్సవం రోజున అంతిమ తీర్పును వెలువరించింది. ఆధారాలను మార్చినందుకు ఐదేళ్లు, మైనర్‌కు డ్రగ్స్ ఇచ్చినందుకు మూడేళ్లు, మైనర్‌ను రేప్ చేసిన కేసుకు జీవిత కాలం, హత్య చేసినందుకు మరణశిక్షను విధిస్తు కోర్టు తీర్ప ఇచ్చింది.