Betting: చదువుకొని, మంచి పొజిషన్లో ఉన్న కొందరు బెట్టింగ్‌ను (Betting) వ్యసనంగా మార్చుకుంటున్నారు. అలా తమ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు కూడా ఇలా బెట్టింగ్‌లో రూ.40 లక్షలు నష్టపోయాడు. చేసిన అప్పు తీర్చలేక.. భార్య, పసిపాపను ఒంటరిని చేసి వెళ్లిపోయాడు.
రొంపిచర్ల మండలానికి చెందిన గంగిరెడ్డికి రెండేళ్ల క్రితం వివాహామైంది. అతనికి 5 నెలల పాప కూడా ఉంది. ఐటీ కొలువు చేసి.. భార్య, పిల్లతో చక్కగా ఉండాల్సింది పోయి.. బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. క్రికెట్ బెట్టింగ్ చేస్తూ.. భారీగా నష్టపోయాడు. బెట్టింగ్ చేస్తూ రూ.40 లక్షల వరకు అప్పు చేశాడు. రోజు రోజు బెట్టింగ్ చేయడం.. డబ్బు కోల్పోవడంతో ఆందోళనకు గురయ్యాడు.
లక్ష, రూ.2 లక్షలు అయితే తీర్చేయచ్చు. చేసిన అప్పు ఎక్కువ ఉంది. దీంతో ఏం చేయాలో తోచ లేదు. బలహీన క్షణంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పల్నాడు జిల్లా సాతులూరు రైలు పట్టాలపై పడి చనిపోయాడు. భర్త చనిపోయాడని తెలిసి భార్య, పిల్ల రోదనలు మిన్నంటాయి. వారిని చూసి అక్కడున్న ప్రతీ ఒక్కరినీ కంట తడి పెట్టించాయి.
బెట్టింగ్ వ్యసనం.. చేతిలో డబ్బులు ఉంటే కొందరు ఈజీగా అలవాటు పడతారు. ఇది పేకాట కన్నా ప్రమాదం అని.. డబ్బులు వెంట వెంటనే కోల్పోతారు. బెట్టింగ్ మాని.. ఫ్యామిలీతో చక్కగా గడపాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.