వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన ట్రూంగ్ మై లాన్‌కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. వాన్ థిన్ ఫాట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ఆమె దాదాపు రూ.లక్ష కోట్లకు సంబంధించి బ్యాంకులను మోసం చేసిందని ఆమె దోషిగా తేలింది.
Vietnam: వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన ట్రూంగ్ మై లాన్‌కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. వాన్ థిన్ ఫాట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ఆమె దాదాపు రూ.లక్ష కోట్లకు సంబంధించి బ్యాంకులను మోసం చేసిందని ఆమె దోషిగా తేలింది. దీంతో ఆమెకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ట్రూంగ్ మై లాన్‌కు స్థానిక సైగాన్ కమర్షియల్ బ్యాంకులో దాదాపుగా 90శాతం వాటా ఉంది. అయితే కొన్నేళ్ల నుంచి బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు.
2018 నుంచి 2022 మధ్య 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి బ్యాంకు నుంచి 304 ట్రిలియన్ డాంగ్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే దాదాపుగా 12.5 బిలియన్ డాలర్లకు పైమాటే. 2019-2022 మధ్య ఆమె డ్రైవర్ బ్యాంకు హెడ్‌క్వార్టర్స్ నుంచి 4.4 బిలియన్ డాలర్ల నగదు లాన్ నివాసానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 2022లో ఈ కుంభకోణం బయటపడింది. ఆ ఏడాదే ఆమెను అరెస్టు చేశారు. తాజాగా ఆమె దోషి అని తేలగా.. కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది.