»Famous Hero Mammootty Film Kaathal The Core Is Banned In Kuwait And Qatar Countries
Mammootty: ప్రముఖ హీరో చిత్రం ఈ దేశాల్లో బ్యాన్..కారణమిదే
ప్రముఖ హీరో మమ్ముట్టి, జ్యోతిక యాక్ట్ చేసిన రాబోయే చిత్రం 'కథల్ ది కోర్' సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నవంబర్ 23న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న వేళ పలు దేశాలు ఈ చిత్రాన్ని నిషేధించాయి. అయితే ఎందుకు బ్యాన్ చేశారో ఇప్పుడు చుద్దాం.
Famous hero mammootty film Kaathal The Core is banned in Kuwait and Qatar countries
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి యాక్ట్ చేసిన తాజా చిత్రం కాతల్ ది కోర్(Kaathal The Core) కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రాన్ని మొదట నేరుగా OTTలో విడుదల చేయాలని భావించారు. కానీ తరువాత మేకర్స్ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఖతార్(Qatar), కువైట్(Kuwait)లలో నిషేధించారు. మలయాళ చిత్రాలకు ఈ మార్కెట్లు సాలిడ్ జోన్లు కాబట్టి ఇది సినిమాపై భారీ ప్రభావం చూపుతుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ ఇటీవలే విడుదల చేయగా..ఇది ప్రేక్షకుల నుంచి మంచి వీక్షణలు సాధించింది. కథల్ ది కోర్’ చిత్రంలో మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేశారు. నవంబర్ 23న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.
వివాదాస్పద కంటెంట్(sensitive subject) కారణంగా ‘కథల్ ది కోర్’ చిత్రాన్ని విడుదలకు కొన్ని రోజుల ముందే కువైట్, ఖతార్ దేశాలు నిషేధించాయి. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కం వంటి అంశాలతో వస్తుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ చిత్రం కువైట్‌లో సెన్సార్‌ను పాస్ చేయడంలో విఫలమైంది. అంతేకాదు ఆయా దేశాల సిద్ధాంతాలను అనుసరించని కథాంశాల కారణంగా ఇటీవల చాలా భారతీయ సినిమాలను పలు దేశాల్లో నిషేధించారు కూడా. ఇప్పుడు ఈ చిత్రాన్ని మరికొన్ని అరబ్ దేశాలు కూడా నిషేధించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
జియో బేబీ(jeo baby) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆదర్శ్ సుకుమారన్, పాల్సన్ స్కారియా సంయుక్తంగా రచయితలు. మమ్ముట్టి కంపానీ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: మాథ్యూస్ పులికాన్, ఛాయాగ్రహణం: సాలు K థామస్, ఎడిటింగ్: ఫ్రాన్సిస్ లూయిస్. ఈ చిత్రంలో ఇతర నటీనటులు లాలూ అలెక్స్, ముత్తుమణి, చిన్ను చాందిని, సుధీ కోళికోడ్, అనఘా అకు, జోసీ సాజో, ఆదర్శ్ సుకుమారన్ ఉన్నారు.