»Qatar We Will Protect Those Who Have Been Hanged Union Foreign Minister Visited The Affected Families
Qatar: ఉరిశిక్ష పడిన వారిని రక్షిస్తాం.. బాధిత కుటుంబాలను పరామర్శించిన కేంద్ర విదేశాంగ మంత్రి
ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ఖతార్ ప్రభుత్వం భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ కెప్టన్లకు ఖతార్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఈక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్లకు అండగా ఉంటామని తెలిపారు.
Qatar: గూఢచర్యానికి పాల్పడ్డారని 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్ మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఎనిమిది మందిని విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు. తాజాగా మంత్రి బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్నిఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఖతార్ నిర్భంధంలో ఉన్న 8 మంది భారతీయుల కుటుంబాలను కలిశాను. కేంద్ర ప్రభుత్వం ఈకేసుకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఈ విషయాన్ని బాధిత కుటుంబాలకు తెలియజేశాను. ఆ కుటుంబాల ఆవేదన, ఆందోళన మాకు అర్థం అవుతోంది. వాళ్ల బాధను మేం అర్థం చేసుకోగలము. మాజీ నేవీ అధికారుల విడుదలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసు వివరాలను ఎప్పటికప్పుడు బాధిత అధికారుల కుటుంబసభ్యులకు తెలియజేస్తామని జై శంకర్ తెలిపారు.
Met this morning with the families of the 8 Indians detained in Qatar.
Stressed that Government attaches the highest importance to the case. Fully share the concerns and pain of the families.
Underlined that Government will continue to make all efforts to secure their release.…
భారత నేవీ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్‌ను 2022 ఆగస్టు 30న ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ సంస్థలో వీళ్లు పనిచేస్తున్నారు. ఎనిమిది మంది ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా వ్యవహరించారని ఖతార్ ఆరోపించింది. ఆ ఆరోపణల కింద అభియోగాలను మోపి.. చివరకు మరణశిక్ష విధించింది. ఎన్నోసార్లు వీరి తరఫున వేసిన బెయిల్ అభ్యర్థలను ఖతార్ కోర్టు తిరస్కరించింది.