»Bail Denial To Manish Sisodia 348 Crore Transfer Is True
Supreme Court : మనీశ్ సిసోడియాకు బెయిల్ తిరస్కరణ..348 కోట్లు బదిలీ నిజమే
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలుపాలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా(Manish Sisodia)కు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్‌లో ఆయనకు బెయిల్‌ను సుప్రీంకోర్టు తిస్కరించింది. ఈ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) కొట్టివేసింది. ఈ కేసులో నగదు లావాదేవీలు జరిగినట్లు కొన్ని ఆధారాలున్నాయని దర్యాప్తు సంస్థ (Investigation)చూపించిందని కోర్టు తెలిపింది. 348 కోట్లు చేతులు మారాయనడానికే ప్రాథమిక ఆధారం ఉందని సుప్రీం కోర్టు వెల్లడించింది.
కాగా సిసోడియా 9 నెలలు నుంచి తిహార్ జైలు(Tihar Jail)లో ఉన్నారు.ఈ కేసు విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఒకవేళ విచారణ నిదానంగా సాగితే.. సిసోదియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్(Bail)కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 26న మనీశ్ సిసోదియాను సీబీఐ (CBI) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మార్చి 9న ఈడీ కూడా సిసోదియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన కస్టడీపై తిహాడ్ జైల్లో ఉన్నారు. ఈ కేసుల్లో బెయిల్ కోసం కింది కోర్టుల్లో ఊరట లభించకపోవడంతో సిసోదియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.